అంబటి సీటుపై ఆర్కే కన్ను..మంగళగిరిలో చేనేత వర్గం లీడర్ ఫిక్స్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది.కానీ ఇప్పటినుంచే అక్కడ రాబోయే ఎన్నికలకు సంబంధించిన ముందస్తు వ్యవహారాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.2024 ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత ఉన్న లీడర్లకు టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారట.అందులో భాగంగానే ప్రతిపక్షం బలపడకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీలోని కీలక లీడర్లను వైసీపీలో చేర్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే మంగళగిరికి చెందిన మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవిని జగన్ ఇటీవల పార్టీలోని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

 Rk's Eyes On Ambati S Seat Fix The Leader Of The Handloom Group In Mangalagiri ,-TeluguStop.com

సిట్టింగులకు స్థానచలనం.

రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ తెగ ఉబలాటపడుతోంది.అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్ ఇచ్చే విషయంలో కీలక మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.

ముఖ్యంగా మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేకు స్థానచలనం ఉంటుందని తెలుస్తోంది.ఆయన్ను సత్తెనపల్లి నుంచి పోటీ చేయించాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారట.ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబును అవనిగడ్డ నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారట.

గతంలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి నారాలోకేశ్, వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయారు.అంతకుముందు ఇదే నియోజకవర్గం నుంచి గంజి చిరంజీవి ఎమ్మెల్యేగా పనిచేశారు.

అయితే,టీడీపీకి బలమైన నేతగా ఉన్న చిరంజీవిని వైసీపీలో చేర్చుకునే ముందు మంగళగిరి స్థానం నుంచి పోటీ చేయిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.అంతేకాకుండా అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో ప్రజావ్యతిరేకత పెరిగినట్టు టాక్ వినిపిస్తోంది.

Telugu Ambati Ram Babu, Cm Jagan, Mangalagiri, Lokesh-Political

ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డికి ముందు నుంచి సత్తెనపల్లిలో పోటీచేయాలని కోరిక ఉండేది.వైఎస్సార్ హయాంలోనూ ఆ సీటు కోసం ఆళ్ల చాలా శ్రమించారట.కానీ అది నెరవేరలేదు.తాజాగా జగన్ మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవికి మంగళగిరి టిక్కెట్ ఇస్తే.ఆళ్లకు సత్తెనపల్లి టికెట్ కన్ఫామ్ అని తెలుస్తోంది.అయితే, అవని గడ్డ నుంచి పోటీ చేయడానికి అంబటి ఓకే అంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube