సంగీతం వినడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందా..?

ప్రతిరోజు ఎంతోమంది పని ఒత్తిడి తగ్గించుకోవడానికి వారికి ఇష్టమైన పాటలను వింటూ ఉంటారు.సంగీతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు.

 Benefits Of Listening To Music,music, Music Therapy, Workout,,zumba Dance, Depre-TeluguStop.com

మనసు బాగోకపోయినా సంతోషంగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఇలా ఏ సందర్భం అయినా చెవిలో హెడ్ ఫోన్స్ తగిలించేసుకుని మనకు ఇష్టమైన పాట వింటూ ఉంటే మాటల్లో చెప్పలేని సంతోషం వస్తుంది.

సంగీతం వినడాన్ని ఇష్టపడే వారి కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 న అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ ప్రారంభించింది.శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది.సంగీతంతో రోగాలను సైతం నయం చెయ్యొచ్చు.అదే మ్యూజిక్ థెరపీ.

కొన్ని క్లిష్టమైన రోగాలను నయం చేసేందుకు సంగీతమే వైద్యం.దాదాపు అన్నీ భాషల్లో సంగీతం ఉంటుంది.ఎవరికి ఏ మ్యూజిక్ నచ్చితే వాటిని వింటూ ఎంజాయ్ చేస్తు ఉంటారు.శరీరనికి, మనసుకి హాయినీ కలుగ చెయ్యడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని సంగీత ప్రియులకు చాలామందికి తెలుసు.

ఇంకా చెప్పాలంటే సంగీతం వల్ల కొన్ని రకాల నొప్పులు, వ్యాధులు కూడా తగ్గుతాయి.

రోజు వర్క్ అవుట్స్ చేసే వాళ్ళకి కొద్దిగా బోర్ కొట్టి ఏం చేస్తాంలే అని అనిపిస్తుంది.

అదే నచ్చిన పాటలు వింటూ ఎంతసేపైనా వ్యాయామం చెయ్యాలని అనిపిస్తుంది.అలా వ్యాయామం చేస్తుంటే టైమ్ కూడా తెలియదు.

సంగీతం వింటూ వ్యాయామం చేయడం వల్ల శ్రమ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ఆందోళనతో బాధపడుతుంటే సంగీతం వింటే చాలా మంచి అనుభూతి పొందవచ్చు.

ఒత్తిడి లో ఉన్నవారికి సంగీతం ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.శరీరం తక్కువగా ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది.

తీవ్రమైన ఆందోళన సమస్యతో బాధపడుతుంటే మ్యూజిక్ థెరపీ కూడా తీసుకోవచ్చు.

పాటలు వింటూ వ్యాయామం చేయడం మనం చూస్తూ ఉంటాం.దాన్నే జుంబా డాన్స్ అంటారు.బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది గొప్ప వ్యాయామం అనే చెప్పువచ్చు.

మంచి బీట్ ఉన్న ఉల్లాసవంతమైన పాట పెట్టుకుని దానికి లయ బద్ధంగా స్టెప్స్ వేస్తూ బరువును తగ్గించుకోవచ్చు.బిజీ షెడ్యూల్ లో ఉన్న చాలా మంది వర్కింగ్ పీపుల్ ఎక్కువగా జిమ్ కంటే జుంబా సెంటర్స్ కి వెళ్తున్నారు.

సంగీతం జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.మెదడు చురుగ్గా ఉండటం వల్ల విషయాలను గుర్తుంచుకునే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube