బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్6 రేపటి నుంచి బుల్లితెరపై ప్రసారం కానుంది.బిగ్ బాస్ షో అభిమానులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే బిగ్ బాస్ సీజన్6 తెలుగు ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.ఈ కంటెస్టెంట్లు రేపటినుంచి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
ప్రముఖ సింగర్లలో ఒకరైన రేవంత్ ఈ షోలో సందడి చేయనున్నారని ఇప్పటికే తేలిపోయింది.బిగ్ బాస్ రివ్యూల ద్వారా పాపులర్ అయిన ఆదిరెడ్డి కూడా ఈ షోలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా ఈ షోలో పాల్గొనే వాళ్ల జాబితాలో ఉన్నారని సమాచారం.ప్రముఖ యాంకర్లలో ఒకరైన నేహా చౌదరి కూడా ఈ షోలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన చలాకీ చంటి కూడా ఈ షోలో సందడి చేయనున్నారు.ఆర్జే సూర్య కూడా ఈ షోలో సందడి చేయనున్నారని బోగట్టా.
ప్రముఖ నటుడు బాలాదిత్య కూడా ఈ షోలో కనిపించనున్నారని సమాచారం.షాన్ని కూడా ఈ షోలో సందడి చేయనున్నారని బోగట్టా.
నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ సుదీప కూడా ఈ షోలో కనిపించనున్నారని తెలుస్తోంది.సీరియల్స్, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన శ్రీసత్య కూడా ఈ షోలో ఉన్నారని తెలుస్తోంది.
యాంకర్ ఆరోహీ రావ్ కూడా ఈ షోలో పాల్గొననున్నారని తెలుస్తోంది.
ఇనయా సుల్తానా, కీర్తి, మోడల్ రాజశేఖర్ కూడా ఈ షోలో సందడి చేయనున్నారని బోగట్టా.రోహిత్, మరీనా, అర్జున్, ఫైమా, ఇనయా సుల్తానా, వసంతి కూడా ఈ షోలో సందడి చేయనున్నారు.వీళ్లతో పాటు ఈ షోలో కామనర్స్ కూడా సందడి చేయనున్నారని తెలుస్తోంది.
నాగార్జున కూడా ఈ షో కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.ఈ సీజన్ లో రేవంత్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు.