తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట 1990లో వచ్చిన మనసు మమత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సితార.
ఆ తరువాత జీవన చదరంగం, గంగ, శ్రీవారి చిందులు, శుక్రవారం మహాలక్ష్మి, అక్కా చెల్లెళ్ళు లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సితార.ఈమె తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది.
అప్పట్లో ఈమె స్టార్ హీరోల సరసన కూడా నటించి వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోయింది.
ఇకపోతే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించడంతో పాటు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నేను చిన్న వయసులోనే హీరోయిన్ కావడంతో టీనేజ్ లైఫ్ లో చాలా మిస్ అయ్యాను.కాలేజీకి వెళ్లినప్పటికీ నా ఆలోచనలు అన్నీ కూడా సినిమాలతోనే నిండిపోయేవి అని తెలిపింది సితార.
సినిమాలతో బిజీ బిజీగా ఉండడంతో ఆమె టీనేజ్ దశను పూర్తిగా ఆస్వాదించలేక పోయాను అని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత ఆమె తండ్రి మరణించడంతో,మా నాన్న చెప్పిన చిన్నచిన్న పనులు చేసి ఉండాల్సింది అని చాలా బాధపడ్డాను అని తెలిపింది సితార.సితార నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్న విషయం తెలిసిందే.పెళ్లి విషయం గురించి సితార ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.
ఇక సితార ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.