డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా షాకిని – డాకిని. ఈ సినిమాలో నివేద థామస్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.ఇక మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ను అందించాడు.
రీచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా టీజర్ ని చూసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ఈరోజు విడుదల కాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.పైగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
ఇందులో రెజీనా దామిని పాత్రలో, నివేద థామస్ షాలిని పాత్రలో కనిపించారు.ఇక వీరిద్దరు పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అవుతారు.ఇక మొదట్లో వీరిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూ కనిపించేవారు.ఇద్దరి మధ్య బాగా అహంకారం ఉండేది.ఏ విషయంలోనైనా ఇద్దరి మధ్యలో విభేదాలు ఉండేవి.
అలాంటిది ఓ సమయంలో వీరిద్దరూ ఒక అర్ధరాత్రి సమయంలో అమ్మాయి కిడ్నాప్ ని చూస్తారు.వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన కూడా వాళ్ళు పట్టించుకోరు.
ఇక దామిని, శాలిని చివరికి రంగంలోకి దిగుతారు.ఈ కేసు గురించి ఎంక్వయిరీలు మొదలు పెడతారు.
ఇక ఆ సమయంలో వారికి ఒక క్రైమ్ జరిగిందని గుర్తిస్తారు.ఆ విషయాన్ని వీరిద్దరూ ఎలా బయటికి తీస్తారు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల విషయానికి వస్తే.ఈ ఇద్దరు హీరోయిన్లు రెజీనా కసాండ్రా, నివేద థామస్ అద్భుతంగా నటించారు.
ఇద్దరు పాత్రలను సమానంగా చూపించారు.ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.ముందుగా ఈ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ మూవీ నుండి రీమెక్ గా తీసుకున్నారు డైరెక్టర్.కానీ చాలా మార్పులు చేశారు.అయినా కూడా ఎందుకో దర్శకుడు ఈ సినిమాను అంతగా మెప్పించలేకపోయాడు అని తెలుస్తుంది.సినిమాటోగ్రఫీ బాగుంది.సంగీతం పర్వాలేదు అన్నట్లుగా ఉంది.బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ కూడా అలాగే ఉంది.ఎడిటింగ్ లో కూడా లోపాలు కనిపించాయి.
విశ్లేషణ:
ఇక ఈ సినిమాకు ఇద్దరూ హీరోయిన్లను పోలీసు అకాడమీలో ఎలా చేరారు.ఎందుకు చేరారు అన్న విషయాన్ని డైరెక్టర్ సరిగ్గా చూపించలేకపోయాడు.
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో లాజిక్కులు మిస్ అయ్యాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, డైలాగ్స్, కామెడీ, సినిమాటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా అనిపించింది.స్క్రీన్ ప్లే లో లాజిక్ లేనట్లుగా అనిపించింది.కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
బాటమ్ లైన్:
సినిమా కథపై ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.కొన్ని సన్నివేశాలలో లాజిక్కు లేనట్లు అనిపించింది.ఎమోషనల్ కూడా అంతగా పండించలేకపోయారు.ఏదో అన్నట్లుగా ఈ సినిమా ఉంది అని చెప్పవచ్చు.