తమ చేతులు తెల్లగా, మృదువుగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది.కానీ, ఆ అదృష్టం మాత్రం తక్కువ మందికి మాత్రమే ఉంటుంది.
ఇంటి పని, వంట పని, ఎండల ప్రభావం, స్కిన్ కేర్ లేక పోవడం, కఠినమైన సబ్బులను వినియోగించడం ఇలా రకరకాల కారణాల వల్ల చేతులు డార్క్‌గా, డ్రైగా మారిపోయి అందవిహీనంగా కనిపిస్తాయి.దాంతో ఏం చేయాలో అర్థంగాక, చేతులను అందంగా మార్చుకోవడం ఎలాగో తెలియక తెగ సతమతమైపోతుంటారు.
అయితే చేతులను తెల్లగా, మృదువుగా మరియు కోమలంగా మార్చడంలో వాసెలిన్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ వాసెలిన్‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలో చూసేద్దాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి, రెండు స్పూన్ల వాసెలిన్, ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఇందులో పావు స్పూన్ కోకో పౌడర్ వేసుకుని కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది.ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేతులకు క్రీమ్‌లా అప్లై చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే కేవలం కొద్ది రోజులకే మీ చేతులు తెల్లగా, మృదువుగా మరియు అందంగా తయారు అవుతాయి.
అలాగే ఒక బీట్ రూట్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఇప్పుడు చిన్న గిన్నెలో నాలుగు స్పూన్ల బీట్ రూట్ రసం, రెండు స్పూన్ల వాసెలిన్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకుని.
ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.ఇలా చేసినా కూడా చేతులు తెల్లగా, మృదువుగా మారతాయి.







