దేశంలో గ‌త మూడేళ్ల‌లో ఎన్ని ఆత్మ‌హ‌త్య‌లు చోటుచేసుకున్నాయో.. వాటికి కార‌ణాలేమిటో తెలిస్తే..

దేశంలో నిరుద్యోగం, అప్పులు, దివాలా కారణంగా ఏటా పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి.గత మూడేళ్ల లెక్కలు చూస్తే దిగ్భ్రాంతికర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.ఎన్‌సిఆర్‌బి అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో డేటా ప్ర‌కారం.2018, 2019 మరియు 2020 సంవత్సరాల్లో 25,000 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయ‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆత్మహత్యల వెనుక దివాలా, నిరుద్యోగం, అప్పుల వంటి కారణాలు తెరపైకి వచ్చాయి.ఈ మూడేళ్లలో అత్యధికంగా 2020లో ఆత్మహత్యలు జరిగాయి.2018 నుంచి 2020 వరకు నిరుద్యోగం, అప్పులు తదితర కారణాలతో ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు.

 Reasons Behind Suicides In India According Natinal Crime Bureau Data Details, Re-TeluguStop.com

భారతదేశంలో నిరుద్యోగం కారణంగా 2018లో 2741 మంది, 2019లో 2851 మంది, 2020లో 3548 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో నిరుద్యోగం కారణంగా 9140 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.అదే సమయంలో, దివాలా మరియు అప్పుల కారణంగా ఈ 3 సంవత్సరాలలో 16,091 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని ఇచ్చింది.

అప్పులు, దివాలాలతో 2018లో 4970 మంది, 2019లో 5908 మంది, 2020లో 5213 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు.దీని ప్ర‌కారం చూస్తే దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింద‌ని తెలుస్తోంది.యూపీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌ధ్యంలో ఈ వివ‌రాలు వెల్ల‌డికావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అలాగే ఏ ప్ర‌భుత్వ‌మైనా నిరుద్యోగ స‌మ‌స్య నిర్మూల‌న‌కు కృషి చేయాల‌ని తెలుస్తోంది.

Reasons Behind Suicides In India According Natinal Crime Bureau Data Details, Reasons ,suicides ,india ,natinal Crime Bureau Data, ,ncrb Data, Union Minster Nithyananda Roy, Unemployment, Debts - Telugu Debts, India, Natinal Bureau, Ncrb, Suicides

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube