ప్రస్తుత కాలంలో ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో రాముడు భీముడు మూవీ రీమేక్ చేయాలని నా చిరకాల కోరిక అని రామానాయుడు గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.రాముడు భీముడు మూవీ రామానాయుడు కెరీర్ ను మార్చిన సినిమాలలో ఒకటి.
ఒక ఇంటర్వ్యూలో రామానాయుడు మాట్లాడుతూ రాముడు భీముడు రీమేక్ లో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పారని అయితే డైరెక్టర్ ఎవరని అడిగాడని రామానాయుడు చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో ఈ సినిమా రీమేక్ లో నటించే అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారేమో చూడాల్సి ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఐదు షెడ్యూళ్లు పూర్తి కాగా మరో నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.దేవర సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కాకుండా 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు.
సముద్రంలో ఎక్కువ సన్నివేశాల షూటింగ్ జరుగుతుండటంతో బడ్జెట్ పెరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ కథ నచ్చితే మల్టీస్టారర్స్ లో కూడా నటిస్తున్నారు.
ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాలలో చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.