పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పవన్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెట్టడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.ఈయన ఇటీవలే ఈ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.
అలా ప్రకటించగానే వెంటనే షూట్ స్టార్ట్ చేసారు.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది.పవన్ వారాహి యాత్రలో ఉండడంతో ఈయన లేని పోర్షన్ ను పూర్తి చేస్తున్నారు.ఈ రోజో రేపో ఈ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేస్తారు అని టాక్.
ఆ తర్వాత షెడ్యూల్ జులై లో స్టార్ట్ అవుతుందని ఎక్కడ స్టార్ట్ చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో ముందు నుండి భారీ క్యాస్టింగ్ తో సుజీత్ నింపేస్తున్న విషయం తెలిసిందే.మరి ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పవన్ తండ్రి పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయితే నటించబోతున్నాడు అని టాక్.ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి.
ఒకవేళ నిజమైతే ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.







