గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ”గేమ్ ఛేంజర్”( Game Changer ) ఒకటి.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలే పెరిగాయి.
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా స్టార్టింగ్ లో జెట్ స్పీడ్ గా శంకర్( Director Shankar ) పూర్తి చేసాడు.
దీంతో ఈయన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఫాస్ట్ గా రిలీజ్ అవుతుందేమో అని అంతా భావించారు.

కానీ రాను రాను ఈయన ఆలస్యం మెగా ఫ్యాన్స్( Mega Fans ) ను కలవర పెట్టింది.ఇక ఇప్పుడు మొత్తమే భారీ గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.అంతేకాదు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇక ఫ్యాన్స్ లో ఉన్న సహనం కాస్త పూర్తిగా నశించి పోయినట్టు తెలుస్తుంది.
అందుకే సోషల్ మీడియా వేదికగా టీమ్ అందరిపై ఫైర్ అవుతున్నారు.

చరణ్ ఫ్యాన్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా శంకర్ పై, నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) మీద ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ తమ హీరో అప్డేట్ కావాలి అంటూ ‘WAKE UP SHANKAR SIR’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.దీంతో ఈ సినిమా మీద ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్ధం అవుతుంది.మరి వీరి కోరిక ప్రకారం ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి.
ఇది పక్కన పెడితే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.







