‘గేమ్ ఛేంజర్’ విషయంలో శంకర్ మీద మెగా ఫ్యాన్స్ గరంగరం.. నెట్టింట రచ్చ!
TeluguStop.com
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ''గేమ్ ఛేంజర్''( Game Changer ) ఒకటి.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలే పెరిగాయి.
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా స్టార్టింగ్ లో జెట్ స్పీడ్ గా శంకర్( Director Shankar ) పూర్తి చేసాడు.
దీంతో ఈయన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఫాస్ట్ గా రిలీజ్ అవుతుందేమో అని అంతా భావించారు.
"""/"/
కానీ రాను రాను ఈయన ఆలస్యం మెగా ఫ్యాన్స్( Mega Fans ) ను కలవర పెట్టింది.
ఇక ఇప్పుడు మొత్తమే భారీ గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.అంతేకాదు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇక ఫ్యాన్స్ లో ఉన్న సహనం కాస్త పూర్తిగా నశించి పోయినట్టు తెలుస్తుంది.
అందుకే సోషల్ మీడియా వేదికగా టీమ్ అందరిపై ఫైర్ అవుతున్నారు. """/"/
చరణ్ ఫ్యాన్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా శంకర్ పై, నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) మీద ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ తమ హీరో అప్డేట్ కావాలి అంటూ 'WAKE UP SHANKAR SIR' అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
దీంతో ఈ సినిమా మీద ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్ధం అవుతుంది.మరి వీరి కోరిక ప్రకారం ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి.
ఇది పక్కన పెడితే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.