గోపీచంద్( Gopichand ) హీరోగా డింపుల్ హయతి హీరోయిన్ గా నటించిన రామబాణం( Rambanam ) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన రామబాణం చిత్రం పై అంచనాలు మొదటి నుండి కూడా పాజిటివ్ గా ఉన్నాయి.
సినిమా కు నందమూరి బాలకృష్ణ టైటిల్ ఖరారు చేయడంతో పాటు సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా వచ్చాయి అంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.ఈ సమ్మర్ కి అసలైన వినోదాల విందును ఈ సినిమా అందించబోతోంది అంటూ కూడా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
ఆకట్టుకునే కథ మరియు కథనాలతో సినిమాలు రూపొందించినట్లుగా మేకర్స్ ప్రకటించారు.గోపీచంద్ మరియు శ్రీనివాస్( Srinivas ) కాంబినేషన్ లో గతంలో వచ్చిన లక్ష్యం మరియు లౌక్యం సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.
కనుక ఈ సినిమా తో మరో విజయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు తమ ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
మరో వైపు రామబాణం సినిమా సక్సెస్ అయితే వెంటనే నందమూరి బాలకృష్ణ హీరో గా శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ను గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది.వీరిద్దరూ కూడా గతంలోనే ఒక సినిమాను చేయాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల సమయంలో చేయలేక పోయారు.కనుక రామబాణం సక్సెస్ అయితే కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గోపీచంద్ తో ఈ సినిమా సక్సెస్ అయితే ముందు ముందు మరికొన్ని సినిమాలు కూడా శ్రీవాస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి గోపీచంద్ చిత్రం రామబాణం ప్రేక్షకులను అలరించేదాన్ని బట్టి అందరి కెరీర్ లు ఆధారపడి ఉంటాయి.
గోపీచంద్ కూడా ముందు ముందు మరిన్ని సినిమాలు దక్కించుకోవాలన్నా.డింపుల్ హయతీ మరిన్ని సినిమాలు చేయాలన్నా కూడా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవాలి.