దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైన 'ఒక పథకం ప్రకారం' ఫస్ట్ లుక్‌కు అనూహ్య స్పందన..

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం.ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు.

 Ram Gopal Varma Sai Ram Shankar Oka Pathakam Prakaram First Look Details, Ram Go-TeluguStop.com

విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది.ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్.

తాజాగా ఈ చిత్ర పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది.దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది.

సినిమా కాన్సెప్టును పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్.ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్.పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది.ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు.

దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతి సోధి, సముద్రఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: వినోద్ విజయన్ నిర్మాతలు: వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్ నిర్మాణ సంస్థలు: వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ ఎడిటింగ్: కార్తిక్ జోగేష్ సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, వినోదిల్లంపల్లి, సురేష్ రాజన్ సంగీతం: గోపీ సుందర్ బిజినెస్ డిజైనర్: ఏలూరు శ్రీను పిఆర్ఓ: మేఘ శ్యామ్

Ram Gopal Varma Sai Ram Shankar Oka Pathakam Prakaram First Look Details, Ram Gopal Varma ,sai Ram Shankar ,oka Pathakam Prakaram, First Look, Ashima Narwal, Shewthi Sodhi, Hero Ravi Shankar, Tollywood - Telugu Ashima Narwal, Ravi Shankar, Okapathakam, Ram Gopal Varma, Sai Ram Shankar, Shewthi Sodhi, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube