తెలుగు సినీ పేక్షకులకు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
అలాగే ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ సమాజంలో జరిగే కొన్ని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ.ఇక రాంగోపాల్ వర్మ మాటలు చేష్టలు మాత్రమే కాకుండా ఆయన సినిమాలు కూడా కాంట్రవర్సీలకు దారి తీసే విధంగా ఉంటాయి.
ఆర్జీవీ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే తరచూ ఏదోక వార్తల్లో నిలిచే వర్మ తాజాగా మరో వార్తతో సోషల్ మీడియాలో నిలిచాడు.
తాజాగా నాగార్జున యూనివర్సిటీకి( Nagarjuna University ) చీఫ్ గెస్ట్ గా వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాజాగా గుంటూరు లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 వేడుకకు ఆర్జీవీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ ఎగ్జిబిషన్ లో వర్మ మాట్లాడుతూ.మీకు నచ్చింది తినండి, తాగండి లైఫ్ ను ఎంజాయ్ చేయండి.పక్కొడి గురించి ఆలోచించవద్దు.ఇక నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే.
అక్కడ ఏం లేకపోతే ఎలా? అందుకే అక్కడికి వెళ్లి బాధపడటం కంటే ఇక్కడే అన్ని అనుభవిస్తున్నాను.అదీకాక స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చు.
అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయాలి అంటూ స్టూడెంట్స్ కు ఉచిత సలహాలు ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
అంతటితో ఆగకుండా కొత్త వైరస్ వచ్చి తాను తప్ప మిగతా మగజాతి అంతా పోవాలని అప్పుడు మహిళలందరికి తానే దిక్కు అవుతాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.వర్మ మాటలకు అక్కడున్న మహిళా లెక్చరర్లు అంతా షాక్ అయ్యారు.నేను బ్రెయిన్ ఉన్న జంతువును అంటూ చెప్పుకొచ్చాడు వర్మ.
ఇక ఆర్జీవీ మాటలను తాను కూడా సమర్థిస్తున్నాను అంటూనే అతడికి ఆస్కార్ అవార్డు( Oscar Award ) ఇవ్వడం కూడా తక్కువే అంటూ యూనివర్సిటీ వీసీ ఆర్జీవీకి మద్దతుపలికాడు.అయితే వర్మ మాట్లాడుతున్నంత సేపు స్టూడెంట్స్ గట్టిగా అరుస్తూ ఈలలు వేస్తూ రెచ్చిపోయారు.