తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్, ఢిల్లీలో నరేంద్ర మోదీ.వీళ్లంతా మోనార్క్లు.
వీళ్లు చెప్పిందే వేదం.చేసిందే శాసనం.
వీళ్లను ప్రశ్నించే దమ్మూ ధైర్యం ఎవరికీ లేవు.పైగా విమర్శలను హుందాగా స్వీకరించి, తప్పులను సరిదిద్దుకునే నైజం వీళ్లది కాదు.
ఎవరైనా కాస్త గట్టిగా విమర్శిస్తే నీ సంగతి చూసుకుంటా అన్నట్లుగా ఉంటుంది వీళ్ల తీరు.
అయితే ఎవరు ఏమనుకున్నా.
మోదీని కూడా విమర్శించే దమ్ము తనకుందని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ చెప్పడం గమనార్హం.ఓ చర్చా కార్యక్రమంలో పబ్లిగ్గా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందే మోదీ ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అంతేకాదు మోదీ ఎన్ని తప్పులు చేస్తున్నా ఎవరికీ విమర్శించే దమ్ము లేదని ఆయన అనడం విశేషం.

యూపీఏ ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరిగితే ఎవరినైనా విమర్శించే వీలు ఉండేది.కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.మీరు కొన్ని మంచి పనులే చేస్తున్నారు.
అయితే కొన్ని విషయాలను బహిరంగంగా విమర్శించలేకపోతున్నారు.అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని చాలా మంది భయపడుతున్నారు.
అందుకే లోపల అసంతృప్తి ఉన్నా మా పారిశ్రామిక మిత్రులు బయటపడలేకపోతున్నారు.
నేను చెప్పేది తప్పే అయినా జరుగుతోంది అదే.నేను మాత్రం బహిరంగంగానే ఆ విషయం చెప్పగలను అని రాహుల్ బజాజ్ అన్నారు.ముఖ్యంగా మోదీ సర్కార్ కొలువుదీరిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
మొన్నటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఆరున్నరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.దీంతో మోదీ ఆర్థిక విధానాలపై రోజురోజుకూ విమర్శలు పెరిగిపోతున్నాయి.అయితే ఇదే చర్చా వేదికపై ఉన్న హోంమంత్రి అమిత్ షా మాత్రం రాహుల్ బజాజ్ విమర్శలను తిప్పికొట్టారు.