భట్టి సీటుపై గురి పెట్టిన టీఆర్ఎస్...అసలు కారణం ఇదే?

తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను బలహీనపరచడానికి మరోసారి టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.అయితే ఇప్పటికే ప్రతిపక్ష నాయకులకు, అధికార పార్టీ నాయకులకు ఒకే జిల్లాలో ఆధిపత్య పోరు అనేది కొనసాగుతూ ఉంటుంది.

 Trs Aimed At Bhatti Seat Is This The Real Reason, Congress Party, Bhatti Vikrama-TeluguStop.com

ఇది రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న వారికి మాత్రం చాలా సాధారణ విషయమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇది చాలా హీటేక్కించే అంశం.ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ అనేది తెలంగాణలో అత్యంత బలహీనంగా ఉండనేది మాత్రం వాస్తవం.

ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలో కూడా కాంగ్రెస్ సత్తా చాట్టలేకపోయింది.ఇంకా కొద్దో గొప్పో కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం.

అయితే ప్రస్తుతం మధిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.అయితే మధిరలో టీఆర్ఎస్ పాగా వేయడానికి బలమైన వ్యూహాలు రచిస్తోంది.ఇప్పటికే వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది.భట్టిపై సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

దీంతో ఇక భట్టి చాలా జాగ్రత్తగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికైతే భట్టి విక్రమార్క బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు భట్టి విక్రమార్కకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదని మాత్రం తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube