రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.శాశ్వత మిత్రులు ఉండరు అంటారు.
నిన్నా మొన్నటి వరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన బిజెపి ,టిడిపి ఇప్పుడు ఒక్కసారిగా విమర్శల చేసుకుంటున్నారు అంటే దానికి కారణం గుజరాత్ ఎన్నికల ఫలితాలే.అయితే బాబు పై వ్యాఖ్యలు చేయడానికి ముందే స్కెచ్ వేసుకుని కూర్చునట్టుగా ఉంది ఏపీ బిజెపి వ్యవహారం .ఫలితాలు ఇలా వచ్చాయో లేదో కానీ ఏపీ బిజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.సోము చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా అవసరం మాది కాదు మీది అంటూ టిడిపి ని చులకనగా చుస్తున్నట్టుగానే ఉన్నాయి.
ఇప్పుడు సోము వీర్రాజు చంద్రబాబుపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి అనేది వాస్తవం.
2003లో చంద్రబాబు చేసిన ఓకే తప్పిదం వల్లే మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయ్ మంచాన పడ్డారంటూ అంటూ సోము చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపిలో తీవ్రమైన కలకలం రేపుతున్నాయి.చంద్రబాబు మాటలు నమ్మి ముందస్తు ఎన్నికలకి వెళ్ళిన వాజ్ పేయ్ ఆ ఎన్నికల్లో ఘోరమియన్ పరాబవం చవి చూశారు.దాంతో వాజ్ పేయ్ తీవ్రమైన మనోవేదనకి లోనయ్యి మంచాన పడ్డారు అని చెప్పారు సోము.
మిత్రపక్షంగా మేము చంద్రబాబు కి ఎంతో విలువ ఇచ్చాము అని కానీ అందుకు బదులుగా బాబు మరియు టిడిపి నాయకులు మమ్మల్ని పురుగులు కంటే హీనంగా చూశారని చెప్పారు.మేము చంద్రబాబు వల్ల అవమానాలు పొందాము తప్ప ఎన్నడు మమ్మల్ని మిత్రపక్షంగా భావించలేదు టిడిపి అన్నారు.
ఏపీలో బిజేపి బలపడుతుంటే చూసి తట్టుకోలేక మమ్మల్ని అణగదొక్కటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని విమర్శించారు.
అయితే సోము మరొక బాబు కూడా పేల్చారు ఈ సారి 175 అసెంబ్లీ సీట్లకు 25 ఎంపి సీట్లకు తాము పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాము అంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.
భాజపా విడిగా పోటీ చేస్తే 9 శాతం ఓట్లు వచ్చాయని.మరి గత సంవత్సరం పోటీ చేస్తే వచ్చింది 2 శాతం అన్నారు.మీతో మిత్ర పక్షంగా ఉండటం వల్ల మాకు ఒరిగింది ఏమి లేదని.పెన్షన్లు ఇప్పుంచుకోలేకపోతున్నామని.
అర్హులకు ఇళ్ళు కూడా ఇప్పించుకోలేకపోతున్నట్లు వాపోయారు.టిడిపి వల్లే మాకు నాలుగు సీట్లు వచ్చాయి అంటున్నారు.
మరి 2003 , 2009లలో టిడిపి ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని నిలదీసారు.అయితే బిజెపి ఇప్పుడు కొత్తగా ఒంటరిగా పోటీ చేస్తాను అనడం మాత్రం సంచలన నిర్ణయం అంటున్నారు.
ఈ దెబ్బతో బిజేపి .టిడిపి బంధం లేనట్లే అని తెలుస్తోంది.