మోడీ ప్రభంజనం ముందు కాంగ్రెస్, హర్ధిక్ పటేల్.ఇలా కొంతమంది త్రయం కూడా నిలవలేక చతికల పడిపోయింది.
మరి ఎక్కడో ఢిల్లీ లో ఉండే క్రేజీవాల్ ఎంత.అంటున్నారు బిజెపి నాయకులు.అసలు మధ్యలో క్రేజీవాల్ ఎందుకు వచ్చాడు అంటే.క్రేజీ వాల్ కి ఆశ ఉండచ్చు కానీ అత్యాశ ఉండకూడదు.అంటున్నారు బిజెపి వాళ్లు అసలు విషయం ఏమిటి అంటే.
అరవింద్ కేజ్రీవాల్.
డిల్లీ ముఖ్యమంత్రి.రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన క్రేజీవాల్.
తమ ఖ్యాతి ఢిల్లీ వరకే పరిమితం కాకూడదు అనుకున్నారు.అందుకే.
పలు రాష్ట్రాలలో తన పార్టీని నిలబెట్టి అక్కడ కూడా తమ చీపురు దులపాలని ప్రయత్నించారు.అయితే క్రేజీ వాల్ కి ఢిల్లీ లో తప్ప మరెక్కడా క్రేజ్ లేదని అర్థం అయ్యింది.
అందుకు తగ్గట్టుగానే ఓటర్లు ఆప్ ని తిరస్కరించారు.
అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా ఈ సారి గుజరాత్ కోటలో తన చీపురు జెండా ఎగరేద్దాం అనుకుని వెళ్లిన క్రేజ్ కి అంత ఆదరణ దొరకలేదు సరికదా తీవ్రమైన భంగపాటు కలిగింది.
తానూ చేయించుకున్న సర్వే ప్రకారం క్రేజీ పార్టీకి కనీసం 20 నుంచీ 30 టికెట్స్ స్థానాలు వస్తాయి అని తెలుసుకుని మరీ 30 స్థానాల్లో అభ్యర్ధుల్ని బరిలో దింపాడు.అయితే మాకూ మీ సేవలు అవసరం లేదు అని గుజారాత్ ఓటర్లు తిరస్కరించారు ఆప్ ని.కనీసం డిపాజిట్స్ కూడా రాని పరిస్థితి కి దిగజారిపోయి ఘోరంగా ఓడిపోయాడు క్రేజీ వాల్.ఇక ఈ దెబ్బతో అయినా సరే క్రేజీ కొంచం దూకుడు కాకుండా శాంతంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తారేమో చూడాలి.