ప్రభాస్, పూజా హెగ్దే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా ఫైనల్ గా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు మేకర్స్.
ఆల్రెడీ సినిమా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసి ఆ టైం లో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ కోసం రాధే శ్యామ్ సినిమా నుండి మరో ట్రైలర్ సిద్ధం చేస్తున్నారట.
ఈ కొత్త ట్రైలర్ లో 3 కొత్త విషయాలు ఉంటాయని తెలుస్తుంది.
రాధే శ్యామ్ సినిమా కొత్త ట్రైలర్ లో థమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు.
ఈ మధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్న థమన్ రాధే శ్యామ్ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తుంది.ఇక రాధే శ్యామ్ కొత్త ట్రైలర్ లో కొన్ని కొత్త షాట్స్ కనిపిస్తాయట.
ప్రభాస్, పూజా హెగ్దేల మధ్య లవ్ సీన్స్ కొత్తగా చూపిస్తారట.ఇక ట్రైలర్ లో మరో విశేషం ఏంటంటే రాజమౌళి వాయిస్ ఓవర్ కూడా ఉంటుందని టాక్.
ఈ 3 అంశాలతో రాధే శ్యామ్ కొత్త ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పు కుంటున్నారు.