మన భారతదేశానికీ చెందిన మహిళ ఒక గొప్ప విజయాన్ని సాధించి మన దేశ చరిత్రను ప్రపంచదేశాలకు తెలియ చేసింది.రష్యాలోని మాస్కోలో జరుగుతున్న “వూషూ స్టార్స్ ఛాంపియన్‌షిప్” మన దేశానికీ చెందిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాదించినది.
అంత చిన్న వయసులో సాదియా గోల్డ్ మెడల్ సాధించడం అంటే మాములు విషయం కాదు.ఆ యువతీ సాధించిన ఘన విజయానికి మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ సైతం ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక సాదియా విషయానికి వస్తే.
జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ లో సాదియా ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది సాదియా.
ఈ నెల అంటే ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ఆటల పోటీలు ఈనెల 28 వరకు జరుగనున్నాయి.ఈ క్రమంలోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క వార్షిక క్యాలెండర్ శిక్షణ పోటీల శనివారం జరిగాయి.
ఈ పోటీలో 15 ఏళ్ల సాదియా తన ప్రత్యర్థి అయిన ఒక రష్యన్ ను ఓడించి మొదటిస్థానంలో నిలిచింది.అలాగే మన భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మంది జూనియర్స్,15 మంది సీనియర్స్ ఈ ఆటల్లో పాల్గొన్నారు.
అయితే సాదియా తారిఖ్ ఒక్కరే జమ్మూకాశ్మీర్ నుంచి పోటీల్లో పాల్గొని అగ్ర స్థానంలో నిలిచింది.సాదియా విజయంపై ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు.
“మాస్కో వుషు స్టార్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్నందుకు సాదియా తారిక్‌కు నా అభినందనలు అని మోడీ తెలిపారు.
ఆమె సాధించిన ఈ విజయం భవిష్యత్తులో ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు.సాదియా భవిష్యత్తులో ఇంకా విజయాలు సాదించాలని కోరుతున్నా అంటూ మోడీ ట్వీట్ చేశారు.అలాగే మోడితో పాటు జాతీయ క్రీడాశాఖ మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సాదియాను పొగిడారు.
ఇప్పటివరకు సాదియా జాతీయ స్థాయి వూషూ ఛాంపియన్‌షిప్ లో ఇదే కాకుండా రెండు బంగారు పథకాలు కూడా సాధించడం విశేషం అనే చెప్పాలి.