కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు రేపు రాష్ట్రానికి రానున్న ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగానే రేపు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు.తరువాత కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.
అదేవిధంగా ఎల్లుండి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ కూడా పర్యటించనున్నారని తెలుస్తోంది.అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలతో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.