ఛాంపియన్ ట్రోఫీ పై కీలక ప్రకటన చేసిన ఐసీసీ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జట్లు..!

ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐసీసీ ఓ కీలక ప్రకటన చేసి కొన్ని క్రికెట్ జట్లకు ఊహించని షాక్ ఇచ్చింది.2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి(Champions Trophy ) సంబంధించిన అర్హత ప్రమాణాలతో పాటు విధి విధానాలకు సంబంధించిన ఇంట్రాక్షన్ ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.

 Icc Made A Key Announcement On The Champions Trophy.. Teams Are Expressing Dissa-TeluguStop.com

2025లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్( Pakistan ) వేదికగా జరుగనుంది.ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటాయి.అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ఏ జట్లకు ఉంటుందంటే.ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో తొలి ఏడు స్థానాలలో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది.

అయితే 2023 వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించని జట్లు వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.ఈ విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఐసీసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ఆతిథ్య పాకిస్తాన్ జట్టు టాప్-7 లో ఉంటే ఎనిమిదవ జట్టును ఏ విధంగా ఎంపిక చేస్తారనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.ఈ ఛాంపియన్స్ ట్రోఫీను రెండేళ్లకు ఒకసారి ఐసీసీ నిర్వహిస్తుంది.ఇప్పటివరకు ఎనిమిది ఎడిషన్స్ నిర్వహించింది.2017లో ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ చివరిది.2017లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్-పాక్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో పాకిస్తాన్ ట్రోఫీ కైవసం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube