తరాలు మారుతున్నా కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి.అలా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలలో ప్రేమిస్తే సినిమా కూడా ఒకటి.
భరత్, సంధ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.ప్రేమిస్తే సినిమా తర్వాత సంధ్య పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.
కొన్ని సినిమాలలో చెల్లి రోల్స్ లో నటించి సంధ్య ఆకట్టుకున్నారు.అయితే కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంధ్య లుక్ పూర్తిస్థాయిలో మారిపోయింది.అర్జున్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సంధ్య ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు.సంధ్యకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సినిమాల్లో చూసిన సంధ్యకు రియల్ సంధ్యకు మధ్య చాలా తేడా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.
అప్పటికీ ఇప్పటికీ సంధ్య పూర్తిస్థాయిలో మారిపోయారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.సంధ్య తమిళ సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.సంధ్య తెలుగు సినిమాలలో కూడా నటిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
సంధ్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే మళ్లీ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కెరీర్ విషయంలో సంధ్య ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సంధ్య రీఎంట్రీలో కూడా వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది.
సంధ్యకు ఈ జనరేషన్ ఆడియన్స్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా సంధ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.