కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రకాష్ రాజ్ హైలైట్ ట్వీట్..!!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది.“ద్వేషం, మతోన్మాదాన్ని తరిమి కొట్టినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు.ద్వేషాన్ని, వంచనను, నగ్న చక్రవర్తిని పారద్రోలిన స్వభాభిమానులైన కన్నడిగులకు వందనాలు” అని ట్వీట్ చేసి ఒక బండి పై బీజేపీ జండాలతో కూడిన బస్తాలు దానిపై అమిత్ షా ( Amit Sha ) బ్యాక్ ఫోటో వెనకాల మోడీ, యోగి ఆదిత్యనాథ్ నడుచుకుంటూ వెళుతున్న ఫోటో పోస్ట్ చేశారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో( Karnataka Elections ) ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

 Prakash Raj Highlight Tweet On Karnataka Election Results Details, Prakash Raj,-TeluguStop.com

136 స్థానాలలో మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకోవడం జరిగింది.బీజేపీ 65 స్థానాలకు పరిమితమైంది.జేడీఎస్ 19 స్థానాలకు ఇతరులు నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు.చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పుంజుకోవటంతో… ఆ పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఎఫెక్ట్ బాగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు.ఇదే జోరు ఈ ఏడాదిలో జరగబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికలలో కూడా చూపించాలని కాంగ్రెస్ కీలక నాయకులు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఏది ఏమైనా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవటం బీజేపీ పార్టీ ఓడిపోవడం పట్ల ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మరింత హైలైట్ అవుతూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube