స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మరో 48 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ రిజల్ట్ ఎలా ఉండబోతుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సాహో సినిమా ఫలితం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరిచిన నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరు కుంటున్నారు.
దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కు సైతం ఈ సినిమా రెండో సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందు కుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం.
అయితే ఈ సినిమా రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని కొంతమంది భావిస్తున్నట్టు తెలుస్తోంది.రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు ముందే ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చింది.
ఏపీలో కొత్త టికెట్ రేట్లను అమలు చేస్తూ ప్రభుత్వం ప్రభాస్ సినిమాకు ప్రయోజనం చేకూర్చింది.
అదే సమయంలో రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభుత్వం పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.
అయితే వైసీపీ రాధేశ్యామ్ కు అనుకూలం అని తేలడంతో ఆ పార్టీపై వ్యతిరేకత ఉన్నవాళ్లు, వైసీపీ నిర్ణయాల వల్ల కలెక్షన్ల విషయంలో నష్టపోయిన హీరోల అభిమానులు రాధేశ్యామ్ వ్యతిరేక ప్రచారానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అయితే సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల కొన్నిసార్లు సినిమా రిజల్ట్ పై ప్రభావం పడి నిర్మాతలు నష్ట పోయే అవకాశం ఉంది.రాధేశ్యామ్ విషయంలో ప్రభాస్ అభిమానులు అలర్ట్ గా ఉంటే మంచిదని సినిమాకు సంబంధించి నెగిటివ్ ప్రచారం జరగకుండా జాగ్రత్త పడాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందు కుంటుందో తెలియాలంటే మరో 48 గంటలు ఆగాల్సిందే.