తిరుమల తిరుపతి దేవస్థానంలో రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది.ఆస్తుల గుర్తింపులో తప్పిదాలు ఉన్నాయని… దాంతో పాటు ప్రైవేట్ ఆస్తులు కూడా జాబితాలో ఉన్నాయని గుర్తించింది.
ఈ నేపథ్యంలో ఆస్తుల పరిరక్షణ కోసం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది.దీనిపై మరోసారి పూర్తిస్థాయిలో టీటీడీ పరిశీలన జరపనుంది.
అనంతరం నూతన జాబితాను దేవాదాయ కమిషనర్ కు అందజేస్తామని తెలిపింది.అంతవరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిషేధం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా చిత్తూరు జిల్లాలో టీటీడీకి మూడు వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి.ఈ క్రమంలోనే వాటి రిజిస్ట్రేషన్లను ఆపాలంటూ దేవాదాయ శాఖకు టీటీడీ లేఖ రాసింది.
దీంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని రిజిస్ట్రేషన్లు స్టాంప్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.