అయ్యో పాపం: పసివాళ్లకు కడుపు నొప్పని వస్తే.. చివరకు..?

కొంతమంది పిల్లలకి కడుపునొప్పి అని సిరప్ తాగినందుకు వారి శరీరమంతా వెంట్రుకలు వచ్చేశాయి.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Stomach Pain Syrup Side Effects On Girl Child, Small Babies, Medicine, Hairs On-TeluguStop.com

ఈ సంఘటన స్పెయిన్ దేశంలో చోటు చేసుకుంది.ఓ యువ జంట కు కలిగిన అమ్మాయికి శరీరంపై వెంట్రుకలు బాగా పెరగడం మొదలయ్యాయి.

ఆ వెంట్రుకలు కొద్దిపాటిగా కాకుండా శరీరం మొత్తం ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి.అంతేకాదు మగవారిలాగా మీసాలు సైతం ముఖంపై రావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.

నిజానికి ఆ చిన్నారి గోధుమ వర్ణం కలిగిన జుట్టుతో పుట్టిన 22 వారాల తర్వాత ఆ పసిబిడ్డ జుట్టుకు ఏకంగా నల్లగా మారిపోయింది.ఆ తర్వాత పూర్తిగా నుదిటి పై కూడా బాగా జుట్టు పెరగడం మొదలు కావడంతో కొన్ని వారాలకు శరీరమంతా పూర్తిగా నల్లని వెంట్రుకలతో నిండిపోయింది.

దీంతో ఆ పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు.వైద్యులు ఆ చిన్నారిని పరీక్షలు చేయించగా మొదటగా ఇలాంటి సమస్య మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా అని అడిగారు.

అందుకు సంబంధించి ఆ సమస్య వారి ఇంట్లో ఎవరికీ లేదని చెప్పి తన బిడ్డకు ఇలా జరగడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు.ఇందులో భాగంగానే ఇదివరకు ఆ చిన్నారికి ఏవైనా మందులు వేశారా అని అడగగా.

ఓ సారి కడుపు నొప్పితో బాధపడుతున్న సమయంలో తన చిన్నారి మాత్రలు మింగదని భావంతో స్థానిక ఫార్మసీలో ఓ సిరప్ కొనుక్కుని వచ్చి దానిని వేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు.దీంతో ఆ సిరప్ శాంపిళ్లను వైద్యులు పరీక్షించగా అసలు విషయం బయటపడింది.

ఆ సిరప్ లోని కలిపిన పదార్థం వల్లనే చిన్నారికి శరీరమంతా వెంట్రుకలు వస్తున్నాయని డాక్టర్లు నిర్ధారించారు.సిరప్ లో మిళితమైన ఓ పదార్థం వల్ల ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో సదరు సిరప్ సంబంధించిన వాటిపై స్పెయిన్ మెడిసిన్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ వెంటనే వాటికి సంబంధించిన అమ్మకాలను పూర్తిగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.కొంతమంది చిన్నారుల కోసం ఆ కుటుంబ సభ్యులు ఆ సిరప్ ను కొనుగోలు చేసి ఆ చిన్నారులతో సైతం వాటిని తాగించేసారు .దీంతో ఆ చిన్నారుల శరీరమంతా వెంట్రుకలు వచ్చేసాయ్ అని ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు.ఇలా మొత్తం 20 మంది చిన్నారులకు శరీరమంతా వెంట్రుకలు వచ్చాయని అధికారులు తెలిపారు.

దీంతో బాధితులకు తగిన న్యాయం చేస్తామని, అలాగే సదరు సిరప్ తయారు చేసిన కంపెనీపై క్రిమినల్ కేసులు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube