విశాఖలోని రుషికొండ నిర్మాణాల అంశంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.ఈ మేరకు లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రుషికొండపై నిర్మాణాల అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.ఇందులో రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది.
ఇప్పటికే హైకోర్టు, ఎన్జీటీలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.ఈ క్రమంలోనే పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.