రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘ధమాకా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది.డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది.

 Pecial Poster From 'dhamaka' Released On The Occasion Of Ravi Teja's Birthday, '-TeluguStop.com

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు.ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉంది.

మొత్తానికి ఈ స్పెష‌ల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది.ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు.

ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు.
ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు.

భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు.మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

నటీనటులు : రవితేజ

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు: త్రినాథరావు నక్కిన, నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్.బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల,స్టోరీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ,సంగీతం: భీమ్స్ సిసిరిలియో,సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల,పీఆర్వో : వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube