జనసైనికులపై పవన్ అసంతృప్తి అందుకోసమేనా?

తెలంగాణ ఎన్నికలు ( Telangana elections )ఇలా ముగిసాయో లేదో వేను వెంటనే జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పట్ల తాను ఎంత సీరియస్ గా ఉన్నానో నిరూపించుకున్నారు.అంతేకాకుండా ఈ సమావేశం లో పార్టీ నాయకులను ఉద్దేశించి ఒకింత సీరియస్ అయిన పవన్, తన భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం .

 Pawan's Displeasure With The Janasiniks , Ycp, Telangana Elections , Modi, Chan-TeluguStop.com

తనను ఇతర పార్టీ అధినాయకులైన మోడీ, చంద్రబాబు ( Modi, Chandrababu )లాంటి నాయకులు అర్థం చేసుకుంటున్నారు గానీ నేను పెంచి పోషించిన నాయకులు కానీ పార్టీ శ్రేణులు గాని అర్థం చేసుకోలేకపోతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ తాను ఇతర పార్టీలకు ఊడిగం చేయడానికి పొత్తులు పెట్టుకోవడం లేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు .

Telugu Chandrababu, Janasena, Modi, Pawan Kalyan, Telangana-Telugu Top Posts

తన లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ ఎప్పుడూ తలదించుకోకూడదని అందువల్లే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నేను చేయను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.2014లో మద్దతు ఇచ్చినా అదే ఉద్దేశంతో ఇచ్చానని, ఇప్పుడు మరోసారి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తానే తప్ప కులాల కేంద్రంగా రాజకీయాలు చేయలేనని ,ఒక కులం రాజకీయాలను శాసించడం జరిగే పని కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు.కులాల గేమ్ ను వైసిపి( YCP ) మొదలుపెట్టిందని ఆ ట్రాప్ లో ఎవరూ పడవద్దు ఆయన జన సైనికులు పిలుపునిచ్చారు.

అన్ని కులాల సమన్వయంతోనే రాజకీయాలు నడుస్తాయని, ఏ ఒక్కరూ ఎక్కువ, తక్కువ కాదంటూ ఆయన చెప్పుకోచ్చారు.

Telugu Chandrababu, Janasena, Modi, Pawan Kalyan, Telangana-Telugu Top Posts

ఇకపై మనం ప్రజల్లోకి వెళ్లే ప్రతిరోజూ జగన్ కి వన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గాలని ఇలా ప్రతిరోజు చేయాలని ఆయన జన సైనికులకు టార్గెట్ ఇచ్చారు.వైసీపీకి ఒక భావజాలం అంటూ ఏమీ లేదని కేవలం అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవటమే లక్ష్యంగా వైసిపి నాయకులు పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ఇప్పటినుంచే క్షేత్రస్థాయి ప్రచారాన్ని ఉదృతం చేయాలని ఆయన జనసైనికులకు పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube