యుద్ధానికి నేను సిద్ధం అంటూ పవన్ సంచలన పోస్ట్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena Pawan Kalyan) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్(Hyderabad) నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగారు.ఈ క్రమంలో పార్టీ కీలక నాయకులు పవన్ ని సాదరంగా ఆహ్వానించారు.

 Pawan Sensational Post About Janasena Party War, Pawan Kalyan,janasena Party,gan-TeluguStop.com

మార్చి 14వ తారీకు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో… పార్టీ శ్రేణులు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.మచిలీపట్నం(Machilipatnam)లో జరగనున్న పదవ ఆవిర్భావ దినోత్సవ సభకు రాష్ట్ర నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కాబోతున్నారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనపై యుద్ధం ప్రకటించడానికి సిద్ధమయ్యారు.

“యుద్ధానికి నేను సిద్ధం… జన సైనికులారా మీరు సిద్ధమా” అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.పవన్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ప్రస్తుతం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ బీసీ సదస్సులో పాల్గొన్నారు.రేపు ఏపీ గవర్నర్ తో బేటి కానున్నారు.అనంతరం ఏపీ కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల విషయంలో పార్టీ వ్యవహరించే తీరు నేతలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube