ఒక్క అమ్మాయి తప్ప రివ్యూ

చిత్రం : ఒక్క అమ్మాయి తప్ప
బ్యానర్ : అంజి రెడ్డి ప్రొడక్షన్స్
దర్శకత్వం : రాజసింహ తాడినాడ
నిర్మాత : అంజి రెడ్డి
సంగీతం : మిక్కి జే మేయర్
విడుదల తేది : జూన్ 10, 2016
నటీనటులు : సందీప్ కిషన్, నిత్య మీనన్, రవి కిషన్ తదితరులు

 Okka Ammayi Thappa Review-TeluguStop.com

యువహీరో సందీప్ కిషన్, క్రేజీ కథానాయిక నిత్య మీనన్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ఒక్క అమ్మాయి తప్ప.మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ సినిమా ట్రైలర్ యువతను ఆకట్టుకుంది.

మరి సినిమా ట్రైలర్ కు తగ్గట్టుగా ఉందో లేదో చూద్దాం.

కథలోకి వెళ్తే …

అస్లం (రాహుల్ దేవ్) అనే ఉగ్రవాది జైలులో ఉంటాడు.

అతడిని విడిపించడం కోసం మరో ఉగ్రవాది అన్వర్ (రవి కిషన్) హైదరాబాద్ , హైటెక్ సిటి దగ్గరి ఫ్లైఓవర్ మీద బాంబు దాడి ప్లాన్ చేస్తాడు.చాలా సినిమాల్లో చూసినట్టే, ఆ దాడి ద్వారా ప్రభుత్వాన్ని బెదిరించి అస్లంను విడిపించడం అన్వర్ ప్లాన్.

మరోవైపు తన చిన్ననాటి స్నేహితురాలిని వెతుకుతున్న కృష్ణ (సందీప్ కిషన్) తో పాటు మ్యాంగో (నిత్య), వందల మంది జనం తీవ్రవాదులు ప్లాన్ చేసిన ఆ ఫ్లైఓవర్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు.

ఆ తీవ్రవాదుల గుంపు అస్లంను విడిపించుకోగాలిగారా ? కృష్ణ హైదరాబాద్ ప్రజలతో పాటు తన ప్రేమని కాపాడుకోగాలిగాడా అనేది మిగితా కథ.

నటీనటుల నటన గురించి :

సందీప్ కిషన్ నటన పరవాలేదు.ఒక మామూలు అబ్బాయిగా, రోజు మనం చూస్తున్నవాడిగా అనిపిస్తాడు సందీప్.

హావభావాల్లో పెద్దగా నాటకీయత కనబడకుండా బాగా మేనేజ్ చేసాడు.హీరోగా తానూ ఇప్పటివరకు చేసిన పాత్రల్లన్నిట్లోకి ఇది విభిన్నం.

అయితే నిత్య మీనన్ కి సరిపడ పాత్ర మాత్రం ఇవ్వలేకపోయాడు దర్శకుడు.తన స్థాయి నటన కనబర్చడానికి పెద్దగా ఛాన్స్ దొరకలేదు.

ఇక విలన్ల గురించి ఎంత తక్కువా మాట్లాడుకుంటే అంత మంచిది.రవికిషన్ ఎప్పటిలాగే విసిగిస్తాడు.

అసలు విలన్లే కరువయ్యినట్టు ఈయన్ని ఎందుకు పట్టుకున్నారో మన దర్శకులు అర్థం కాదు.ఇక కామెడి బ్యాచ్ ఎక్కడా కూడా నవ్వించలేకపోయారు.

సాంకేతికవర్గం పనితీరు :

మిక్కి జే మేయర్ అందించిన సంగీతం బాగుంది.చిన్న సినిమా అయినా, సరిపోయే సంగీతాన్ని అందించాడు.

ఒక బాలివుడ్ పాటను కాపి కూడా కొట్టాడు.అది వేరే విషయం.

చోటా.కే.నాయుడు సినిమాటోగ్రాఫి సినిమాకు పెద్ద బలం.గట్టిగా చెప్పాలంటే, ప్రధాన బలం.డైరెక్షన్ వీక్ ఉన్న చోట, కెమెరా ఎక్కువ మార్కులు కొట్టేసింది.గౌతమ్ రాజు లాంటి సీనియర్ ఎడిటర్ తీవ్రంగా నిరాశపరిచారు.

అనవసరమైన సీన్లు లెక్కపెట్టుకుంటూ కూర్చోవచ్చు సినిమా చూస్తున్నంత సేపు.ఇక దర్శకుడు రాజసింహ సినిమాకి రియల్ విలన్.

ఎంచుకున్న కథాంశం బాగా ఉన్నా, దాన్ని సరైన తీరులో స్క్రీన్ మీద చూపించలేకపోయారు.మరి ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్ సినిమా విజయ అవకాశాల్ని దారుణంగా దెబ్బ తీయొచ్చు.

విశ్లేషణ :

ఎంచుకున్న కథ చాలా బాగుంది.కాని తీసిన విధానమే బాగా లేదు.

సినిమాలో ఒక్క ఆసక్తికరమైన సన్నివేశం పడగానే, ఇలాంటి జానర్ లో వచ్చిన నాలుగైదు హిందీ సినిమాలు గుర్తుకువచ్చి, ఇది కూడా వాటిలాగే ఆకట్టుకుంటుందేమో అని అత్యాశ పడతాం.హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు.

దర్శకుడు కాస్టింగ్ లో తప్పు చేసాడేమో అనిపిస్తూ ఉంటుంది.సినిమాకు సెకండాఫ్ ఆయువుపట్టు.

కొన్ని సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి.కాని సీన్ కి, సీన్ కి మధ్య సరైన కనెక్టివిటి లేక ఏదో లోపించినట్టుగా అనిపిస్తుంది.

పెట్టిన టైటిల్ కి , జరుగుతున్న కథకి పెద్ద సంబంధం ఏమి లేదే అని మామూలు బి,సి సెంటర్ ప్రేక్షకుడు నెత్తి పట్టుకోవాల్సిందే.ఇంత మంఛి కథను చేతిలో పెట్టుకొని ఇలా చేయి కాల్చుకోవడం ఏంటో అనుకుంటూ థియేటర్ బయటకు రావాల్సిందే.

ఇలాంటి సినిమాలు తెలుగులో తక్కువ.బాలివుడ్ సినిమాలు బాగా అలవాటుపడి, కాస్తంత ఓపిక ఉంటే , ఇలాంటి ప్రయోగాన్ని చోడొచ్చు

>హైలైట్స్ :

* సందీప్ కిషన్ నటన
* కొన్ని డైలాగులు
* సెకండాఫ్
* మ్యూజిక్

డ్రాబ్యాక్స్ :

* కాస్టింగ్
* స్క్రీన్ ప్లే
* ఫస్టాఫ్
* అనవసరపు సన్నివేశాలు
* ఎడిటింగ్
* లో బడ్జెట్ (ఈ కథకు పెద్ద బడ్జెట్ అవసరం)
* కుదరని ప్రేమకథ

చివరగా :

ఓపిక ఉంటే ఒక్కసారి తప్ప, మళ్ళీ చూడటం కష్టం.

తెలుగుస్టాప్ రేటింగ్ : 2/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube