ఏపీలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ కీలక నిర్ణయాలు వెల్లడించారు.చవితి వేడుకలపై ప్రత్యేక ఆంక్షలు ఏమి పెట్టలేదన్న ఆయన.
భద్రత దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.దీనిలో భాగంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.