ఐపీఎల్ 2008 లో మొదలై చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ఉండడం వల్ల బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం పొందుతున్న క్రికెట్ బోర్డుగా చరిత్రలో నిలిచింది.ఆదాయం ఊహించిన స్థాయి కంటే రెట్టింపు వస్తూ ఉండడంతో బీసీసీఐ ప్రతి సంవత్సరం ఆడంబరంగా ఐపీఎల్ ను నిర్వహిస్తోంది.
ఐపీఎల్ లో పాల్గొనే జట్లలో ప్రతి సంవత్సరం టీం మేనేజ్మెంట్ లు గెలుపు కోసం మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నాయి.ఐపీఎల్ లో గెలిచిన జట్టుకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.
ఐపీఎల్ 2023 సీజన్లో టైటిల్ గెలిచిన చెన్నై జట్టుకు ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పడం అసాధ్యం.ప్రస్తుతం ఐపీఎల్ 2024 కోసం కొన్ని టీం మేనేజ్మెంట్ లు జట్ల కెప్టెన్లతో పాటు ఇతర మార్పులు, చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఆ జట్లు ఏంటో చూద్దాం.
లక్నో: లక్నో( Lucknow ) జట్టు ఆడిన రెండు సీజన్లలో ప్లే ఆఫ్ కు చేరింది కానీ ఎందుకు ఫైనల్ కు వెళ్లలేకపోతుందో అర్థం కావడం లేదు.జట్టులో మంచి మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ కప్పు కొట్టలేక పోతుంది.లక్నో జట్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్( KL Rahul ) ఉన్న విషయం మనకు తెలిసిందే.2024లో కేఎల్ రాహుల్ కు బదులు మరో కెప్టెన్ ను తీసుకునేందుకు టీం యాజమాన్యం కసరత్తు చేస్తోంది.

చెన్నై: 2024లో చెన్నై జట్టుకు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni )కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాడా లేదంటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే జట్టుకు కొత్త కెప్టెన్ గా ఋతురాజ్ గైక్వాడ్ ను రంగంలోకి దింపాలని టీం యాజమాన్యం భావిస్తోంది.
ఢిల్లీ: ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్( Rishabh Pant ) కారు ప్రమాదానికి గురి కావడం వల్ల 2023 సీజన్ కు ఢిల్లీ జట్టు కెప్టెన్ గా వార్నర్ ఉన్న విషయం తెలిసిందే.వార్నర్ కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు బోల్తా పడింది.2024 సీజన్ కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.

హైదరాబాద్: హైదరాబాద్ జట్టుకు ఇప్పటికే చాలామంది కెప్టెన్లుగా చేశారు.కెన్ విలియం సన్, వార్నర్, భువనేశ్వర్ కుమార్ కూడా జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించారు.2023 సీజన్ కు ఏడయిన్ మార్కరం
.