నాగశౌర్య నటించిన తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి.ఈ సినిమాకు డైరెక్టర్ అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
ఇందులో నాగశౌర్య సరసన షిర్లే సెటియా హీరోయిన్ గా నటించింది.షిర్లే ఈ సినిమాకు తొలిసారిగా పరిచయం అయింది.
ఇక ఇందులో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటించారు.ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూల్పూరి ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.
ఇక మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు.సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించాడు.
ఇక ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా కథపరంగా ఎలా ఆకట్టుకుందో చూడాలి.అంతేకాకుండా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్యకు ఎటువంటి సక్సెస్ అందిందో చూడాలి.
కథ:
ఇందులో నాగశౌర్య కృష్ణ అనే పాత్రలో సాంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడుగా కనిపించాడు.ఇక కృష్ణ తను పనిచేసే ఆఫీసులో తనకు నార్త్ అమ్మాయి వ్రింద (షిర్లీ సెటియా) పై ఇష్టం పెరుగుతుంది.
అది కాస్త ప్రేమగా మారుతుంది.దీంతో ఇక ఆమెను ఒప్పించేందుకు బాగా ప్రయత్నాలు చేయటంతో చివరకు ఆమె ఒప్పుకుంటుంది.
అలా మొత్తానికి ఇద్దరికీ పెళ్లి కూడా అవుతుంది.ఇక పెళ్లి తర్వాత వీరు కొన్ని సవాల్ ఎదురుకుంటారు.
అలా వారు ఎదుర్కొన్న సవాలు ఏంటి.వారి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి ఎలా స్పందిస్తారు.
పైగా ఇద్దరి అభిరుచులు వేరున్న వీరు ఎలా మూవ్ అవుతారు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నాగశౌర్య బ్రాహ్మణుడి కుర్రాడుగా అద్భుతంగా నటించాడు.తన బాడీ లాంగ్వేజ్ కూడా బాగా ఆకట్టుకుంది.ఇక తన లుక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు.
ఇక తొలిసారిగా ఈ సినిమాతో పరిచయమైన షిర్లీ గురించి గొప్పగా చెప్పాల్సింది ఏమీ లేదు.కానీ ఆమె లుక్స్ మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ ఈ సినిమా కథ విషయంలో ప్రేక్షకులతో పాటు నాగశౌర్యను కూడా నిరాశపరిచాడని చెప్పవచ్చు.సంగీతం కూడా ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది.బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.ఎడిటింగ్ లో చాలా లోపాలు ఉన్నాయి.సినిమాటోగ్రఫీ కూడా అంతగా మెప్పించలేకపోయింది.
నిర్మాణాత్మక విలువలు కొంతవరకు బాగానే ఉన్నాయి.
విశ్లేషణ:
ఇక ఈ సినిమాను డైరెక్టర్ కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలనుకున్నాడు.కానీ నిరాశపరిచాడు.మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్యకు ఈ సినిమా కూడా నిరాశపరిచినట్లు తెలుస్తుంది.నిజానికి డైరెక్టర్ కథ విషయంలో ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.కామెడీ కూడా పరవాలేదు.నాగ శౌర్య నటన బాగా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్:
కథ అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఎడిటింగ్ కూడా బాగాలేదు అని చెప్పవచ్చు.
బాటమ్ లైన్:
కథలో కొత్తదనం లేదు.టెక్నికల్ విలువలు కూడా అంతగా కనెక్ట్ కాలేదు అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు.