కాకినాడ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ) నివాసానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు.
ఈ మేరకు కిర్లంపూడిలోని( Kirlampudi ) ముద్రగడ నివాసంలో వీరు భేటీ కానున్నారు.ఇప్పటికే ముద్రగడ ఇంటికి వైసీపీ జిల్లా కాపు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరుకోగా.
ఆయన అనుచరులు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.ఈ నేపథ్యంలో ముద్రగడను వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
అయితే ప్రస్తుతానికి ఎటువంటి షరతులు లేకుండానే ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.