టాలీవుడ్ ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలివే!

మనలో కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన చాలామంది వ్యక్తుల సక్సెస్ వెనుక అమ్మ ఉంటుందనే సంగతి తెలిసిందే.కన్నబిడ్డలకు ఏ కష్టం వచ్చినా అమ్మ అస్సలు తట్టుకోలేదు.

 Mother Sentiment Movies In Tollywood Industry Kgf Yogi Chatrapathi Nijam Details-TeluguStop.com

కొడుకు, కూతురు కోరుకున్న ప్రతిదీ వాళ్లకు దక్కేలా అమ్మ తన వంతు కష్టపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ తో( Mother Sentiment Movies ) తెరకెక్కి సక్సెస్ సాధించిన సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది.

ప్రభాస్ వినాయక్ కాంబినేషన్ మదర్ సెంటిమెంట్ తో యోగి( Yogi Movie ) అనే సినిమా తెరకెక్కింది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోకపోయినా ప్రభాస్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చింది.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా( Life Is Beautiful ) కూడా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కడం గమనార్హం.అమల తల్లి పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Telugu Amma Cheppindi, Ammananna, Bichagadu, Beautiful, Mother, Nijam, Yamaleela

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కూడా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కి ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.తల్లి తన కొడుకు కోసం చేసే త్యాగాన్ని ఈ సినిమాలో చూపించారు.తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన నిజం మూవీ సైతం మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కడం గమనార్హం.కొడుకు సాయంతో భర్త మరణానికి కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే తల్లి కథతో ఈ సినిమా తెరకెక్కింది.

Telugu Amma Cheppindi, Ammananna, Bichagadu, Beautiful, Mother, Nijam, Yamaleela

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన యమలీల, దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన అమ్మ రాజీనామా, గుణ్ణం గంగరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన అమ్మ చెప్పింది, ప్రభాస్ జక్కన్న కాంబోలో తెరకెక్కిన ఛత్రపతి, విజయ్ ఆంటోని శశి కాంబోలో తెరకెక్కిన బిచ్చగాడు, అజయ్ కుమార్ డైరెక్షన్ లో మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మాతృదేవోభవ సినిమాలు మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కి సక్సెస్ సాధించాయి.యశ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు సైతం అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కి సక్సెస్ సాధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube