పిగ్మెంటేషన్ తో చింతేలా.. ఈ సింపుల్ రెమెడీని ట్రై చేస్తే పైసా ఖర్చు లేకుండా పరిష్కారం పొందవచ్చు!

స్కిన్ పిగ్మెంటేషన్( Skin pigmentation ).చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.

 Super Effective Home Remedy To Get Rid Of Pigmentation! Home Remedy, Pigmentatio-TeluguStop.com

ముఖ్యంగా మహిళల్లో పిగ్మెంటేషన్ సమస్య అనేది అధికంగా కనిపిస్తుంది.వయసు పై బ‌డటం, ఎండల ప్రభావం, ప్రెగ్నెన్సీ, హార్మోన్ చేంజెస్, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల పిగ్మెంటేషన్ సమస్య ఏర్పడుతుంది.

దీంతో ముఖంపై అక్కడక్కడ ముదురు రంగు మచ్చలు ఏర్పడతాయి.స్కిన్ టోన్ అన్ ఈవెన్ గా మారుతుంది.

ఈ క్ర‌మంలోనే పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడేందుకు ఖరీదైన క్రీమ్ ల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.కొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.మీరు కూడా పిగ్మెంటేషన్ సమస్యతో చింతిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే పైసా ఖర్చు లేకుండా పరిష్కారం పొందవచ్చు.అవును, మ‌రి ఈ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Tips, Skin Tone, Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

ముందుగా ఒక అరటిపండు ( banana )తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు మరియు నాలుగైదు టేబుల్ స్పూన్లు బియ్యం కడిగిన వాటర్ వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అరటిపండు ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్( Milk powder ), వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin Tone, Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే పిగ్మెంటేషన్ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.ఈ రెమెడీ పిగ్మెంటేషన్ మచ్చలను మాయం చేసి మీ స్కిన్ టోన్ ను ఈవెన్ గా మారుస్తుంది.

అలాగే చర్మంపై ముడతలను నివారిస్తుంది.స్కిన్ ను టైట్ గా బ్రైట్ గా మారుస్తుంది.

కాబట్టి పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube