బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో ఈడీ ఇచ్చిన నోటీసులను అత్యున్నత న్యాయస్థానంలో కవిత ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కవిత సుప్రీంకోర్టు( Supreme Court )లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేయనుంది.
అయితే నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో పాటు కవిత కేసును కూడా సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవకుండా వారి నివాసాల్లోనే విచారణ చేయాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరుతున్నారు.ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది.