మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ ను జిల్లా గా సీఎం జగన్ ప్రకటించారు.పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల పలు ప్రాంతాలను కలిపారు.జిల్లాల పునర్విభజన ప్రక్రియ చాలా బ్రంహాండంగా ఉంది.11వేల ఆర్బీకే కేంద్రాలు, గ్రామ సచివాలయాలను సీఎం ఏర్పాటు చేశారు.అధికార వికేెంద్రీకరణ చేస్తోన్న సీఎంగా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు.కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని 2018 పాదయాత్రలో స్థానికులు వైఎస్ జగన్ ను కోరారు.
జిల్లాల విభజన అనంతరం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని వైఎస్ జగన్ అప్పుడే హామీ ఇచ్చారు.సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారు.
విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్చినందుకు సీఎంకు పాదాభివందనం చేస్తున్నా.
ఎన్టీఆర్ ఆశయాలకు వైకాపా వ్యతిరేకం కాదు.
చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలున్నాయి.జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మార్పులు చేర్పులకు అవకాశాలున్నాయి.
ప్రజలు అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరించే ముందుకు వెళ్తాం.జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం గుడ్డిగా ముందుకు వెళ్లదు.
గుడివాడ లో ఏదో జరిగిందని చీర్ బాయ్ లతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారు.ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తెదేపాకు రాష్ట్రంలో ఏ అంశమూ లేదు.
ఏ అంశం లేకే గుడివాడ అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం సహా ఏదేదో చేస్తున్నారు.
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్చలేకపోయారు.భారత రత్న ఇవ్వాలని కోరతాడు.కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటే చంద్రబాబును ఎవరైనా ఆపారా.? ఎన్టీఆర్ పేరును కూడా చంపేయాలని నీచమైన ఆలోచన చంద్రబాబుది.వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఒడిపోయు అందరూ పక్కరాష్ట్రాలకు వెళ్లి చీర్ బాయ్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎజెండా చంద్రబాబు సెట్ చేస్తాడు.సోము వీర్రాజు అమలు చేస్తారు.
రాష్ట్రంలో తెదేపాకు బీ పార్టీగా భాజపా మారింది.సోము వీర్రాజును తెదేపా బీ టీంగా భాజపాను తయారు చేశారు.
సోము వీర్రాజు భాజపాను చంద్రబాబు కు అద్దెకిచ్చారు.