ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో చేసే పనులతో కటకటాల పాలు అవుతున్నారు.తాజాగా ఓ యువతి బాత్రూంలో స్నానం చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఈ వీడియో తీసి ఆపై లైంగిక వాంఛలు తీర్చాలంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాకి చెందినటువంటి రాజపురం ప్రాంతంలో ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది.అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి స్నానం చేయడానికి బాత్ రూమ్ కి వెళ్లగా అదే ప్రాంతంలో నివసిస్తున్న అటువంటి ఎబేసన్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులు మరో ఇద్దరు కలిసి తమ చరవాణిలో వీడియో తీశారు.
అంతేకాక వారి లైంగిక కోరికలు తీర్చాలని అంటూ ఆ యువతిని ఇబ్బంది పెట్ట సాగారు.అలాగే వారు చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియోని ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు.
దీంతో పరువు గురించి ఆలోచించిన ఆ యువతి తనలో తానే మధన పడుతూ ఉండేది.
![Telugu Tamilnadu-Telugu Crime News(క్రైమ్ వార్తలు) Telugu Tamilnadu-Telugu Crime News(క్రైమ్ వార్తలు)](https://telugustop.com/wp-content/uploads/2020/01/men-arreted-in-tamilnadu.jpg)
అయితే ఎలాగో ధైర్యం చేసినటువంటి ఆ యువతి తన బంధువుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా అప్పటికే విషయం తెలుసుకున్న ఆ ముగ్గురు నిందితులు పరారయ్యారు.
అయితే ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరైన టువంటి ఎబెసన్ అనే నిందితుడు తెంగాయ్ పట్టినం తీరంలో తలదాచుకుం టుం డగా పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.అలాగే మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.