ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ పేరు చెప్తే గుర్తు పట్టని ప్రేక్షకుడు లేడు.సీత రామం హిట్ అయ్యిన తర్వాత దుల్కర్ కి టాలీవుడ్ తో పాటు పక్క భాషల్లోనూ మంచి క్రేజ్ వచ్చింది.
నిజానికి దుల్కర్ సల్మాన్ ఎలాంటి బ్యాగ్రౌడ్ లేకుండా రాలేదు.తన వెనక మలయాళ ఇండస్ట్రీ మెగా స్టార్ మమ్ముట్టి ఉన్నాడు.
మమ్ముట్టి ఏకైక కుమారుడే ఈ దుల్కర్ సల్మాన్.అయితే దుల్కర్ కి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ అతడి తండ్రి మమ్ముట్టి కి మాత్రం కొడుకునీ ఇండస్ట్రీ కి తీసుకు రావడం ఇష్టం లేదు.
సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదని, తన లాగ తన కొడుకు కూడా కష్టాలు పడకూడదని బాగా చదివి, మంచి ఉద్యోగం చేయాలనీ అతడు భావించాడు.అదే విధంగా తండ్రి కోసం డిగ్రీ చదివి దుబాయ్ కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేసాడు దుల్కర్.
కానీ కొన్ని రోజుల తర్వాత తన బ్లడ్ లో ఉన్న నటన అనే ఆసక్తి తనను ఉద్యోగం చేయనివ్వలేదు.దాంతో ఇండియా కు వచ్చి బాషా తో సంబంధం లేకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు, మలయాళం, తమిళ్ మరియు హిందీ భాషల్లో నటిస్తూ పాపులర్ హీరో గా ఎదిగాడు.
దుల్కర్ హీరో అయినా తర్వాత కూడా నటన ఆపేసి ఉద్యోగం చేయాలనీ మమ్ముట్టి కోరుకున్నాడు.అంతే కాదు ఇంకా నటిస్తూ నా పరువు తియ్యకు అంటూ కొడుక్కి వార్నింగ్ కూడా ఇచ్చాడట మమ్ముట్టి.అయినా కూడా దుల్కర్ తండ్రి మాటను కాదని సినిమాల్లో నటిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సౌత్ ఇండియా లో మంచి హీరోగా ఎదిగాడు. మహానటి సినిమాతో తొలిసారి తెలుగు లో నటించిన దుల్కర్ సీత రామం సినిమాతో మరోమారు తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ఇక దుల్కర్ ప్రముఖ ఆర్కిటెక్చర్ అమల సుఫియాను వివాహం చేసుకోగా వీరికి ఒక కుమార్తె కూడా వుంది.