రాజమౌళి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తి అంచనాలు భారీగా ఉండటం చాలా కామన్ విషయం.బాహుబలి సినిమా తర్వాత ఆయన స్థాయి బాలీవుడ్ ని కూడా దాటేసి వెళ్ళి పోయింది అనడం లో సందేహం లేదు.
తాజాగా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండడం తో ఆయన నుండి వస్తున్న సినిమా కోసం ప్రతి ఒక్క సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు చెబుతున్నారు.
ఈ సమయంలో మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది.
ఇప్పటికే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతుంది అంటూ విజయేంద్రప్రసాద్ అధికారికంగా ప్రకటించారు.
రాజమౌళి కూడా ఈ విషయం లో ఒక క్లారిటీ ఇచ్చారు.యాక్షన్ అడ్వెంచర్ సినిమా గా భారీ ఎత్తున మహేష్ బాబు సినిమా తీయబోతున్నట్లు ఆయన ప్రకటించడం తో పాటు మహేష్ బాబు అభిమానులకు స్పష్టమైన హామీ ఇచ్చాడు.
ఈ సినిమా లో హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాల తరహాలో సన్నివేశాలు ఉంటాయని రాజమౌళి హామీ ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ప్రకటించాడు.

అయితే రాజమౌళి సినిమా అనగానే రోజుకో పుకారు అన్నట్లుగా వార్తలు వస్తూనే ఉంటాయి.ఇంకా మహేష్ బాబు సినిమా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందు అప్పుడే పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.కథ గురించి హీరోయిన్ల గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కొన్ని వేల పుకార్లు షికార్లు చేశాయి.ఇప్పుడు ఈ సినిమా గురించి ఎన్ని రకాలుగా పుకార్లు షికార్లు చేస్తాయో చూడాలి.వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటారా లేదంటే తల పట్టుకుంటారా అనేది చూడాలి.