బల్లి మీద పడితే అదృష్టమా, దురదృష్టమా అనేది బల్లి పడిన ప్రదేశమును ఉంటుంది.బల్లి మీద పడినప్పుడు వచ్చే ఫలితాలు ఆడవారికి,మగవారికి వేరు వేరుగా ఉంటాయి.
ఇప్పుడు మగవారిలో శరీరంపై ఏ భాగంలో పడితే ఏమి జరుగుతుందో
ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.బలిశాస్త్రం ప్రకారం మగవారి మీసంపై బల్లి
పడితే ఆర్థికపరమైన నష్టాలు ఎదురు అవుతాయి.
అదే తొడ మీద పడితే దుస్తులు నాశనం అవుతాయి.కాలి వేళ్ళ మీద పడితే ఇదొక
అనారోగ్య సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పాదాలపై పడితే అనుకోని
ప్రయాణం చేయవలసి వస్తుంది.
కుడి భుజంపై పడితే కష్టాలు,సమస్యలు వస్తాయి.
అదే ఎడమ భుజంపై పడితే పది
మందిలో పరువు పోయి అగౌరం మిగులుతుంది.అలాగే చేతి వేళ్ళపై పడితే
అనుకోకుండా ఇంటికి బంధువులు,స్నేహితులు రావటం జరుగుతుంది.
మణికట్టుపై బల్లి పడితే బంగారం కొనే అవకాశం ఉంటుంది.వీపుపై ఎడమ భాగం
పడితే విజయం మీ సొంతం అవుతుంది.కింద పెదవిపై పడితే విపరీతమైన ఆదాయం
వస్తుంది.అదే పై పెదవిపై పడితే కలహాలు వస్తాయి.
పురుషుల ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి లాభాల బాటపడతారని అర్థం చేసుకోవాలి.కానీ ఎడమ, కుడి కన్నుపై పడితే అశుభ ఫలితాలు తప్పవని బల్లి శాస్త్రం చెప్పుతుంది.