అయ్య బాబోయ్: బ్యాంకాక్ అసలు పేరును పలకండి చూద్దాం..!

థాయిలాండ్ పేరు వింటే చాలు టక్కున గుర్తొచ్చే పేరు బ్యాంకాక్.జీవితంలో ఒక్కసారి అయినా బ్యాంకాక్ కు వెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ముఖ్యంగా మగవాళ్ళు అయితే మరి ఉత్సాహపడి పోతారు.

 Let's Say The Real Name Of Bangkok . Bankok, Bankok Originalname, Original Na-TeluguStop.com

ఎందుకంటే బ్యాంకాక్ లో బీచ్ లు, అందమైన అమ్మయిలతో మసాజ్ లు మగవారికి ఇంకా ఉత్సహాన్ని ఇస్తాయి కాబట్టి.నిజానికి మనం పిలిచే బ్యాంకాక్ పేరు అది కాదు అంట.బ్యాంకాక్ ఒరిజినల్ నేమ్ మరొకటి ఉంది.అసలు బ్యాంకాక్ కి ఇంకొక పేరు ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు.

బ్యాంకాక్ అసలు పేరు వింటే మీరు షాక్ అవుతారు.దాన్ని చదవడానికే మీకు ఒక పూట సమయం పడుతుంది మరి.బారెడు అంత పెద్ద పేరు అన్నమాట.మరి ఆలస్యం చేయకుండా బ్యాంకాక్ అసలు పేరు ఏంటో తెలుసుకుందామా.

పేరుతో పాటు ఆ పేరు వెనుక ఉన్నా అర్ధం, పరమార్ధం ఏంటో కూడా చూద్దాం.బ్యాంకాక్ అసలు పేరు ఒక పద్యంలాగా ఎవరికీ అర్ధం కానీ భాషలో ఉంటుంది.

ఇంతకీ అసలు పేరు ఏంటంటేక్రుంగ్‌థెప్‌మహానాఖోన్ అమోన్‌రత్తనకొసిన్‌ మహింథరయుత్తయ మహాదిలోక్‌ఫోప్ నొప్పరాట్రచతానిబురిరోమ్ ఉదోమ్‌రచనివెట్‌మహాసతాన్ అమోన్‌పిమాన్‌అవతన్‌సాత్హిత్‌ సఖటతియావిట్సనకుమ్‌ప్రసిట్‌ఇదండీ బ్యాంకాక్ అసలు పేరు.చదివేటప్పటికీ నీరసం వచ్చిందా.నోరుతిరగని పదాలతో డిఫరెంట్ గా ఉంది కదండీ.పలకడానికి పది గంటల సమయం పట్టేట్టు ఉంది కదా.పాలి, సంస్కృత భాషల్లోని కొన్ని పదాలతో బ్యాంకాక్ కు ఈ పేరు పెట్టారట.మరి ఈ పేరుకు గల అర్ధం ఏంటో ఒకసారి చూద్దామా దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజ భవంతుల నగరం, మనిషి రూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం.

అనే చాలా రకాల అర్ధాలు ఉన్నాయట.

Telugu Bankok, Bankok Origianl, Original, Thailand, Latest-Latest News - Telugu

బ్యాంకాక్ కి ఈ పేరు పెట్టిన వ్యక్తి కింగ్ మాంగ్‌కుట్ మహారాజు 1782లో ఫుత్తయోత్ఫా చౌలలోక్ బ్యాంకాక్‌ ను రాజధానిగా మార్చుకున్నాడు.అప్పుడు బ్యాంకాక్ ను క్రుంగ్‌ థెప్ తవరవాడి సి ఆయుత్తయ, క్రుంగ్‌ థెప్ మహానిఖోన్ సి ఆయుత్తయ అని పిలిచేవారు.ఆ తరువాత 1833లో బ్యాంకాక్ పేరును సియా- యుతియాగా మార్చడం జరిగింది.

ఆ తర్వాత 1850 లో కింగ్ మాంగ్‌ కుట్‌ పైన చెప్పిన పెద్ద పేరును పెట్టారు.ఈ పేరుకు ఇంకో రికార్డ్ కూడా ఉందండోయ్అతి పొడవయిన పేరు గల నగరంగా గిన్నిస్ బుక్‌ లోనూ బ్యాంకాక్ నగరం చోటు చేసుకుంది.

ఇప్పుడు ఈ నగరాన్ని అందరూ బ్యాంకాక్ అని పిలుస్తున్నారు.కానీ అక్కడి స్థానికులు మాత్రం అదే పాత పేరుతో పిలుస్తారట.మొత్తం పేరు పలకడం అంటే కష్టం కాబట్టి క్రుంగ్‌థెప్ మహానిఖోన్, క్రుంగ్‌థెప్ అని అక్కడి ప్రజలు బ్యాంకాక్ ను పిలుస్తారట.ఒకసారి మీకు తీరిక దొరికినప్పుడు బ్యాంకాక్ అసలు పేరు మొత్తం చదివి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube