స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప‘ సినిమా చేస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వంలో బన్నికి ఇది మూడో సినిమా గా తెరకెక్కుతుంది.
అందుకే ఈ హ్యాట్రిక్ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్ మొదటి సారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
నిన్ననే రష్మిక లుక్ ను రివీల్ చేసారు.ఈ లుక్ చూస్తేనే అర్ధం అవుతుంది.
రష్మిక పక్కా పల్లెటూరి అమ్మాయిగా గిరిజన యువతిగా కనిపించ బోతుందని.
ఇక ఈ సినిమాలో విలన్ రోల్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు.
ఇప్పటికే ఆయన లుక్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
![Telugu @pushpamovie, Allu Arjun, Fahadh Faasil, Latestpushpa, Pushpa, Pushpa Vil Telugu @pushpamovie, Allu Arjun, Fahadh Faasil, Latestpushpa, Pushpa, Pushpa Vil](https://telugustop.com/wp-content/uploads/2021/09/latest-talk-about-pushpa-movie-villain-fahadh-faasil-and-suneel-detailsa.jpg )
ఆయన పాత్ర లో విలనిజం ఇలా ఉండబోతుందా అని ఈయన పాత్రపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.అయితే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.కానీ విలన్ రోల్ ను మాత్రం చిత్ర యూనిట్ మొదటి భాగం దాదాపు చివరి దశకు వచ్చినప్పుడు ప్రకటించారు.
![Telugu @pushpamovie, Allu Arjun, Fahadh Faasil, Latestpushpa, Pushpa, Pushpa Vil Telugu @pushpamovie, Allu Arjun, Fahadh Faasil, Latestpushpa, Pushpa, Pushpa Vil](https://telugustop.com/wp-content/uploads/2021/09/latest-talk-about-pushpa-movie-villain-fahadh-faasil-and-suneel-detailss.jpg )
ఇక ఈయన పాత్రపై ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి.తాజాగా ఈ సందేహం కు సమాధానంగా ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తుంది.ఈయన పాత్ర మొదటి భాగంలో చివరిలో కొద్దిసేపు ఉంటుందని ఆ తర్వాత సెకండ్ పార్ట్ లో ఫుల్ విలన్ రోల్ రివీల్ అవుతుందని ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట.మొదటి పార్ట్ లో చివరిగా ఫహద్ ను పరిచయం చేసి సెకండ్ పార్ట్ పై ఉత్కంఠ రేకెత్తించబోతున్నట్టు తెలుస్తుంది.
![Telugu @pushpamovie, Allu Arjun, Fahadh Faasil, Latestpushpa, Pushpa, Pushpa Vil Telugu @pushpamovie, Allu Arjun, Fahadh Faasil, Latestpushpa, Pushpa, Pushpa Vil](https://telugustop.com/wp-content/uploads/2021/09/latest-talk-about-pushpa-movie-villain-fahadh-faasil-and-suneel-detailsd.jpg )
అయితే అప్పటి వరకు అసలు సినిమాలో విలన్ ఉండదా అనే డౌట్ కు సమాధానం కూడా ఉంది.ఈ సినిమాలో ఫహద్ ఎంట్రీ ఇచ్చే వరకు విలన్ పాత్రలో ఇంకొకరు ఉన్నట్టు టాక్.అతను ఎవరో కాదు సునీల్.ఈయన కమెడియన్ గా మెప్పించి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే పుష్ప సినిమా కోసం విలన్ గా సునీల్ మారుతున్నట్టు తెలుస్తుంది.సునీల్ ను సుకుమార్ ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.