లేడీ అభిమానితో నితిన్‌కు చిక్కులు!

యంగ్‌ హీరో నితిన్‌ వరుస విజయాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే.ఈయన విజయాలు సాధించడంతో అభిమానులను కూడా పెంచుకుంటూ పోతున్నాడు.

 Lady Fan Enters Nithin’s Home At Night-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ అభిమానం వల్లే నితిన్‌కు పెద్ద చిక్కు వచ్చింది.ఒక అమ్మాయి నితిన్‌కు పెద్ద అభిమానని అంటూ, ఆయన్ను పెళ్లి చేసుకుంటానని, పెళ్లి చేసుకోక పోతే చనిపోతానంటూ ఆయన ఇంట్లోనే వివాదం సృష్టించింది.

నిన్న రాత్రి వాచ్‌మెన్‌కు తెలియకుండా నితిన్‌ ఇంట్లోకి దూరిన ఒక అమ్మాయి, తెల్లవార్లు ఆ ఇంట్లోనే ఉంది.తెల్లవారు జామున నితిన్‌ తల్లి ఆమెను చూసింది.

ఆ అమ్మాయితో మాట్లాడిన నితిన్‌ తల్లి షాక్‌ అయ్యింది.తాను నితిన్‌ను పెళ్లి చేసుకుంటానని, ఆయనంటే ప్రాణమంటూ ఆమెతో పేర్కొంది.

దాంతో నితిన్‌ తల్లి పోలీసులను పిలిచింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆ అమ్మాయితో మాట్లాడారు.

ఆ అమ్మాయి ఒక పోలీస్‌ ఆఫీసర్‌ కూతురు అని తేలింది.నితిన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయం తెల్సిందే తాను వచ్చానంటూ ఆమె పోలీసులకు తెలియజేసింది.

ఏదోలా నచ్చజేప్పి ఆమెను అక్కడ నుండి పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube