టీ కాంగ్రెస్ ను వేధిస్తున్న స్టార్ క్యాంపెనర్ల కొరత?

తెలంగాణ ఎన్నికల్లో( Telangana elections ) అన్ని రాజకీయ పార్టీలు తమదైన ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.అధికార బారాస నుంచి ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ రోజుకి మూడు నుంచి నాలుగు సభలను కవర్ చేస్తుంటే, మరోపక్క కేటీఆర్ ,హరీష్ రావులుట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తూ అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాలు చేపడుతున్నారు.

 Lack Of Star Campaigners Harassing T Congress, Telangana Elections , Telangana C-TeluguStop.com

హరీష్ రావు ద్వితీయ శ్రేణి నాయకులతో సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే కేటీఆర్ మీడియా సమావేశాలను ఆన్లైన్ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.ఇలా ఎవరికి వాళ్లు తమ తమ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ మిగతా రాజకీయ పార్టీల కన్నా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అయితే రేవంత్ రెడ్డి లేకపోతే ఢిల్లీ నాయకులు తప్ప కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి రావడం లేదని, వీరంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Telugu Komativenkat, Mallubhatti, Revanth Reddy, Telangana, Ts-Telugu Political

అయితే వీరంతా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తో పోసగక సైలెంట్ గా ఉంటున్నారా లేక వీరిని ప్రచారానికి పంపించడం రేవంత్ రెడ్డి కి ఇష్టం లేక తమ నియోజకవర్గాలకు పరిమితమయ్యారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏదేమైనా సీఎం రేసులో తాము కూడా ఉన్నామని రకరకాల వేదికలపై చెప్పుకున్న కోమటిరెడ్డి( Komatireddy Venkat Reddy ) బట్టి విక్రమార్క ,జగ్గారెడ్డి, జానారెడ్డి లాంటి నేతలు కూడా రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ఎందుకు కదలటం లేదన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

Telugu Komativenkat, Mallubhatti, Revanth Reddy, Telangana, Ts-Telugu Political

రాష్ట్రం మొత్తం కవర్ చేస్తున్న రేవంత్ రెడ్డి వన్ మాన్ షో లా మేనేజ్ చేయాల్సి రావడం రేవంత్ కు భారమవుతుందని ఇలాంటి సమయంలో బాధ్యతలు పంచుకునే కీలక నాయకులు అండ కాంగ్రెస్కు అవసరమని విశ్లేషణలు వినిపిస్తున్నా పరిస్థితులు అయితే మారుతున్న వాతావరణం కనిపించడం లేదు.మరి రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు చక్కబడతాయో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube