నాగార్జున రామ్ గోపాల్ వర్మతో శివ సినిమా( Siva movie ) చేసినప్పుడు ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణ వంశీ( Krishna Vamsi ) తో నాగార్జున సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇక ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమని సినిమా చేదామని చెప్పాడట.
తన మొదటి సినిమాగా గులాబీ సినిమా ని కంప్లీట్ చేసిన తర్వాత నాగార్జున కి ఫస్ట్ ఒక కథ చెప్పాడట.అది ఓకే అని చెప్పిన నాగార్జున తొందరగా సెట్స్ మీదకి వెళ్దామని చెప్పారట.
ఇక ఆ తర్వాత కొద్దిరోజులకు కృష్ణవంశీ మళ్ళీ వచ్చి ఇంకొక కథ చెప్పారట.
ఇది కూడా నాగార్జునకి( Nagarjuna ) నచ్చిందట.దాంతో షూటింగ్ తొందరగా పెట్టుకుందాం అని చెప్పాడట.ఇక మళ్లీ రెండు నెలల దాకా కృష్ణవంశీ కనిపించకపోవడంతో నాగార్జున తన డేట్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలా లేదంటే ఈ సినిమా మీద కేటాయించాలా అనేది అర్థం కాక కృష్ణవంశీ పిలిపించి ఒక రోజు వార్నింగ్ కూడా ఇచ్చాడట.
తమాషా గా ఉందా సినిమా చేస్తావా, చేయవా అని గట్టిగా అడగడంతో అప్పుడు కృష్ణవంశీ సినిమా చేద్దాం సార్ కానీ చెప్పి మీకు చెప్పిన రెండు స్టోరీ లు బాగానే ఉన్నాయి.
కానీ మన కాంబినేషన్ లో సినిమా అంటే చాలా సంవత్సరాలు పాటు గుర్తుండిపోయే సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో నేను ఇంకొక ఫ్యామిలీ సబ్జెక్టుని రెడీ చేశాను.ఒకసారి వినండి అని చెప్పి నిన్నే పెళ్ళాడుతా సినిమా ( ninne pelladata movie )స్టోరీ చెప్పాడట.ఆ కథ నాగార్జునకి బాగా నచ్చి సరే ఈ సినిమా చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అలాగే టైం తీసుకున్న పర్లేదు కానీ మంచి కథ తీసుకొచ్చావు అని కృష్ణవంశీ ని మెచ్చుకున్నాడట.
ఇక అలా నిన్నే పెళ్ళాడుతా సినిమా అనేది తెరకెక్కింది.కానీ ఈ సినిమా సమయంలో కృష్ణవంశీ నాగార్జునను టార్చర్ పెట్టాడని నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో నవ్వుతూ చెప్పాడం విశేషం…