హైదరాబాద్ లోని తెలంగాణ భవన్( Telangana Bhavan ) కు రేపు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రానున్నారు.ఈ మేరకు కృష్ణా బేసిన్ పరిధిలోని ఐదు జిల్లాల బీఆర్ఎస్ నేతలతో ఆయన భేటీ కానున్నారు.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ మరియు ఖమ్మం జిల్లా( Khammam District )కు చెందిన నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు.ఈ క్రమంలోనే ఈ నెల 13 వ తేదీన నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.ఈ భారీ బహిరంగ సభా వేదికపై నుంచే లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha elections ) బీఆర్ఎస్ శంఖారావాన్ని పూరించనుంది.